8 June, 2026 | 9:50 PM

Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •  

తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి

08-06-2026 08:40 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మృతి. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుదేకుల అజీమ్ (73) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. అజీమ్ జూన్ 7 తేదీ సాయంత్రం అజీమ్ మాల్తుమ్మెద గేట్ నుంచి పోచారం గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, కిరణ్ బార్బర్ షాప్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చి ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయనకు తలకు, ఎడమ చేతికి,శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే గోపాల్పేట్‌లోని జేఎస్‌ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం మెదక్‌లోని సూఫీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ హాజీ ఫాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.