8 June, 2026 | 9:33 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •   తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి   •   కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది   •   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి   •   ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి   •   పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా   •   కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి   •  

కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి

08-06-2026 08:19 PM

ఉప్పల్ జోన్ హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బిఈడీ పంకజకి వినతి పత్రం అందజేసిన తుంగతుర్తి రవి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీలో నూతన నీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను మెరుగు పరచాలని, అదేవిధంగా, 10వ డివిజన్ పీర్జాదిగూడ మల్లికార్జున నగర్‌లో రోడ్డు నెం.01 నుండి రోడ్డు నెం.06 వరకు ప్రస్తుతం ఉన్న 90 మి.మీ. హెచ్‌డిపిఈ పైప్‌లైన్‌కు అనుసంధానంగా 150 మి.మీ. డి.ఐ. వాటర్ సప్లై పైప్‌లైన్ ఏర్పాటు చేసి అవసరమైన జంక్షన్లు కల్పించాలని కోరుతూ ఉప్పల్ జోన్ హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజకి తుంగతుర్తి రవి  ఆధ్వర్యంలో ధరణి కాలనీ సభ్యులు, మల్లికార్జున నగర్ వాసులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, ధరణి కాలనీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో లేకపోగా, మరికొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్ ఉన్నప్పటికీ సరిపడా తాగునీటి సరఫరా జరగడం లేదని తెలిపారు. దీంతో కాలనీవాసులు నిత్యం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు, అలాగే ధరణి కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం తో మున్సిపల్ అధికారిలకు తెలిపటం తో వారు కూడా కాలనీ లో పర్యటించి సమస్య ఉన్న చోట పరిశీలించటం జరిగింది. ధరణి కాలనీలో నూతన పైప్‌లైన్ ఏర్పాటు, తాగునీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచే చర్యలు, అలాగే మల్లికార్జున నగర్‌లో ప్రతిపాదిత పైప్‌లైన్ పనులను త్వరితగతిన మంజూరు చేసి అమలు చేయాలని తుంగతుర్తి రవి కోరారు. ఈ వినతిపై స్పందించిన ఈడీ పంకజ  సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.