జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం
ఆందోళనలో కుటుంబ సభ్యులు
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటి నుంచి పనికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. ఎస్.హెచ్.ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారంజవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాల పేటలో కలివల, గణేష్ అనే వ్యక్తి తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. గణేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 5వ తేదీన శ్వేత ఉదయం యధావిధిగా పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే, సాయంత్రం అయినా ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు.
శ్వేత కోసం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో భర్త గణేష్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.గత నెల 5 నుండి శ్వేత కనిపించకుండా పోయింది. ఆమె జాడ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్హెచ్వో సైదులు, అన్నారు.మహిళ ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.






