6 May, 2026 | 8:18 PM

పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు

06-05-2026 07:43 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ  దంపతులు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం వారి పెళ్ళి రోజును పురస్కరించుకుని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బల్కంపేట ఆలయం

తమ పెళ్ళి రోజు సందర్భంగా బుధవారం  తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పెళ్ళి రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, గుడిగే శ్రీనివాస్ యాదవ్, జితేందర్ శుక్లా తదితరులు శాలువాలతో సత్కరించి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మహంకాళి ఆలయం

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు తమ పెళ్ళి రోజు సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు తలసాని దంపతులకు EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పలువురు తలసాని దంపతులను శాలువాలు, పూలమాలతో సత్కరించి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు.