23 August, 2026 | 6:03 PM

వ్యవ‘సాయం ఎలా..?’

22-05-2024 01:58 AM

ఖరీఫ్ ప్రణాళికల తయారీలో అధికారుల నిర్లక్ష్యం

సీజన్ సమీపిస్తున్నా ఖరారు కాని వ్యవసాయ శాఖ ప్రణాళిక

రైతులకు అందుబాటులో ఉండని ఆగ్రికల్చర్ అధికారులు 

క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు, సలహాలు కరువు

పట్టించుకోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 

సంగారెడ్డి, మే ౨౧ (విజయ క్రాంతి): ప్రతి ఏడాది వానా కాలం సీజన్‌కు సంబంధించి జిల్లా స్థాయిల్లో ప్రణాళికలు తయారు చేస్తా రు. ఏ పంటలు సాగు చేస్తారు.. ఎన్ని ఎరువు లు కావాలి.. విత్తనాలు ఎన్ని కావాలి, పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు ఎన్ని అవసరం తదితర అంశాలతో కూడిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయి తే, ఈ పాటికే సర్కారుకు అందించాల్సిన నివేదిక ను సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికా రులు కనీసం అంచనాలు వేయడంలో కూ డా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

మే చివరి వారం నుంచి రైతులు సాగుబడికి సిద్ధమవుతుంటారు. విత్తనాలు, ఎరువులు సమ కూర్చుకుంటారు.  కానీ, అధికారుల తీరుతో ఈ సారి జిల్లా రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవనే ప్రచారం జరుగుతోంది. వానాకాలం సీజన్‌లో సుమారు 8లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసే అవకాశం ఉంద ని తెలుస్తుండగా, అధికారులు ఎలా స్పందిస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అందుబాటులో ఉండని అధికారులు..

 ప్రతి మండలానికి ఓ అధికారి, 5 వేల ఎకరాలకు ఒక్క ఏఇవో ఉన్నా ఏనాడు రైతులకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి.  జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో ఏవోలు రైతులకు సూచనలు, సలహాలు చేయడం లేదని తెలుస్తోంది. ఏటా ఏప్రిల్, మే  నెలల్లో వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి సేకరించి, భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ సారి ఒక్క మట్టి నమూనా కూడా సేకరించలేదని తెలుస్తోంది.  కొంతమంది ఏఈఓ నిత్యం మండల కార్యాలయంలో పని ఉందంటూ అసలు విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

పొంచి ఉన్న నకిలీల ముప్పు!

వానాకాలం సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్కెట్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటిలో అసలు, నకిలీలు గుర్తించడంలో రైతులు తికమకపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు వ్యాపా రులు నకిలీ మందులు, విత్తనాలను అంటగడుతున్న సంఘటనలు ఏటా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపుల్లో తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లాకు అవసరమైన వ్యవసాయ శా ఖ ప్రణాళికలను రూపొందించడంలో అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని సమ యానికి రైతులకు విత్తనాలు, ఎరువులు అం దుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.