10-02-2026 12:00:00 AM
చలాది పూర్ణచంద్రరావు :
తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి సుమారు 311 ఏళ్ల విశిష్టమైన చరిత్ర ఉంది. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంతటి పవిత్రమైన లడ్డులో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలు వాడి తయారు చేసిన లడ్డూలను భక్తులకు అందచేసినట్లు లేబరేటరీ నివేదికలతో పాటు, దీనిపై సిట్ విచారణ తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్నది. ఈ దారుణంపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూట మి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశాలిచ్చినా కేంద్రంలోని బీజేపీ పెద్దగా స్పందించడం లేదన్న అపోహ ఉంది.
అయితే విశ్వ హిం దూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తాజాగా జగన్ పాలనలో తయారు చేసిన తిరుమల లడ్డూప్రసాదంలో కల్తీ జరగడం, ఆ కల్తీ లడ్డూలనే భక్తులకు అందించటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. తన పాలన లో ఇలాంటి పాపం చేసినందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను, అప్పుటి టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చెయ్యాలని, అలాగే దేవాలయాల పవిత్రతను కాపాడి పరిరక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన చర్యలు తీసుకోవాలని చేసిన ప్రకటన శ్రీవారి భక్తుల్లో కొంత నమ్మకం కలిగిస్తోంది.
మూగబోయిన గొంతుక..
కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువున్న తిరుమలపై సుమారు 35 మఠా లులకు, పీఠాలకు టీటీడీ స్థలాలను కేటాయించింది. అయితే ఆ స్థలాల్లో వారు భారీగా భవంతులు నిర్మించి వ్యాపార కేం ద్రాలుగా మార్చుకున్న తీరు పరిశీలించి చూస్తే.. పవిత్రమైన శ్రీవారి మహాప్రసా దం నకిలీ నెయ్యి పేరుతో, రసాయనాలతో కల్తీ చేసి లడ్డూలు తయారీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై ఆయా మఠా ధిపతు లు, పీఠాధిపతులు స్పందించకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నది.
తిరుమల పుణ్యక్షేత్రంలో ఆశ్రమాలు, మఠాలు నిర్మించుకొని భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణా న్ని, బస సౌకర్యాలను కల్పిం చడంతో పాటు ఈ ఆశ్రమాలు వేద పఠనం, ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా చైతన్యాన్ని కలిగించాల్సిన బాధ్యత వీటిపై ఉంటుంది. కానీ ఆయా మఠాలు, పీఠాల్లో కి అధిపతులు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేయడం, మిగిలిన రోజుల్లో గదులు, కళ్యాణమండపాలను అద్దెలకు ఇస్తూ అక్రమార్జన చేస్తున్నారనే ఆరో పణ లు ఉన్నాయి.
హిందుత్వ ప్రతినిధులుగా పీఠాధిపతులు, మఠాధిపతులు శ్రీవారి మహాప్రసాదంపై నోరు మెదపకపోవడం బాధాకరమని భక్తులు పేర్కొంటున్నారు. అయితే పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు ల్యాబ్ టెస్టింగ్ ద్వారా వెలుగులోకి రావడంతో ప్రపంచం నలుమూ లలా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబికడం సాధారణమే అని చెప్పొచ్చు.
లడ్డూ మహాప్రసాదం కల్తీ నెయ్యితో చేసి శ్రీవారికి నివేదించటం మహాపాపం.. అలాంటి లడ్డు ప్రసాదాన్ని తమకు అమ్మడాన్ని శ్రీవారి పరమ భక్తులు జీర్ణించు కోలేక పోతున్నారు. శతాబ్ధాల పోరాటం అనంతరం అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ఇదే టీటీడీ నుంచి మలినమైన లక్ష లడ్డూలనే పంపించడం క్షమించరాని చర్య అని భక్తు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూకు జీఐ ట్యాగ్..
శ్రీవారి లడ్డూ విశిష్టత, దాని తయారీ విధానం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆగమ శాస్త్ర ప్రకా రం తిరుమలలో శతాబ్దాలుగా శ్రీవారికి జరుగుతున్న కైంకర్యాల్లో పవిత్రమైన ల డ్డూకి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదలై ఇప్పటికి సుమా రు 311 ఏండ్లు దాటినట్లు చరిత్ర చెబుతున్నది. ఆగస్ట్ 2, 1715ను శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ జన్మదినంగా పేర్కొంటారు. ఈ మూడు వందల ఏళ్ల కాలంలో లడ్డూ ఆకా రం మారుతూ వచ్చిందే తప్ప రుచి మా త్రం ఎప్పుడూ ఒకేలా ఉండేది.
లడ్డూ త యారీకి శాస్త్రీయంగా వాడే పదార్థాల పా ళ్లు మొత్తం 803 కేజీలతో తయా రు చేయగా.. వాటితో దాదాపు 5,100 లడ్డు లు తయారవుతాయి. దీనినే ‘దిట్టం’ అని పిలుస్తారు. ఈ దిట్టం కోసం వాడే ప దార్ధాలు తగ్గించటానికి ఏ మాత్రం వీలు ఉం డదు. ఈ మొత్తంలో నాణ్యమైన స్వచ్ఛ మైన ఆవు నెయ్యి (180 కేజీలు), చక్కెర (400 కేజీలు), ఎండు ద్రాక్ష (16 కేజీలు), యాలాకులు (4 కేజీలు), కలకండ (8 కేజీలు), ముంత మామిడి పప్పు (30 కేజీ లు) సహా జీడిపప్పు, బూందీ, పచ్చ కర్పూ ర మిశ్రమాన్ని కలిపి మహాప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీ.
ఇక ల డ్డూలను తయారుచేసే ప్రదేశాన్ని ‘పోటు’శాలగా పిలుస్తారు. అయితే శ్రీవారి పోటు లో తయారు చేసే తిరుమల లడ్డూల మాదిరిగా కొన్ని వ్యాపార సంస్థలు తమ వద్ద నుంచి ప్రయత్నించినప్పటికీ ఆ రుచి తెప్పించడంలో విఫలమయ్యాయి. ఇంతటి మాధుర్యం, పవిత్రత కలిగిన తిరుమల లడ్డూకు ‘జియోగ్రాఫిక్ పేటెంట్’ ఉండడం విశేషం. 2006లో లడ్డూ ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం టీటీడీ దరఖాస్తు చేసుకోగా, 2009లో తిరుపతి లడ్డూ జీఐ ట్యాగ్ పేటెంట్ హక్కులను పొందడంతో పాటు, దీనిపేరుతో మరో దగ్గర లడ్డూలను తయారు చేయకుండా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది.
బాధ్యులను శిక్షించాలి..
ఇంతటి విశిష్టత ఉన్న లడ్డూ మహాప్రసాదం ‘దిట్టం’లో వాడాల్సిన అత్యంత నా ణ్యమైన స్వచ్ఛమైన వస్తువులకు బదులు నకిలీ నెయ్యిని వాడి పేటెంట్ హక్కులను కాలరాసినట్లయింది. ఈ అంశంపై ప్రధాని మోదీ సహా బడా రాజకీయవేత్తలు, వ్యా పారవేత్తలు, సాధారణ ప్రజలు భగ్గమన్నా రు. అలిపిరి చెకపోస్ట్ తనిఖీల్లో ఎవరి దగ్గరైనా కనీసం 50 గ్రాముల మాంసం దొరి కితేనే వారిని జైలుకు పంపే నిబంధన అ మల్లో ఉంది.
ప్రసాదం కల్తీ అంశం అక్రమార్జనకు తెర తీసిందన్న అంశంతో పాటు తిరుమలకు వచ్చే భక్తుల్లో శ్రీవారి మహాప్రసాదంపై విశ్వాసం సన్నగిల్లేలా చేసేం దుకు బయటి నుంచి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూకల్తీలో నిజమెంత అనే దానిపై అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అవసరముంది. ఈ అంశంపై మీనమేషాలు లెక్కించకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 9491545699