25 April, 2026 | 6:26 PM

ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్

25-04-2026 04:56 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరు ప్రైమరీ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్.పి.వి. వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు సాయికుమార్ మాట్లాడుతూ... కౌమార దశలో ఉన్న బాలికలకు భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా ( సర్వైకల్) క్యాన్సర్ రాకుండా నివారణ కోసం ముందు జాగ్రత్తగా హ్యూమన్ పోపీలోమా వైరస్ (హెచ్.పి.వి) వ్యాక్సిన్ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎవరైతే 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు నిండకుండా ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.