14 April, 2026 | 1:41 PM

మానవ హక్కులకు అండగా హెచ్‌ఆర్సీ

16-11-2025 12:00 AM

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమాన గౌరవము, స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది. మానవ హక్కులు అనే పదం కేవలం చట్టపరమైన హామీ మాత్రమే కాదు, మనిషి పుట్టుకతో పొందే జీవన గౌరవం, స్వేచ్ఛ, భద్రత, సమానత్వం వంటి విలువల సమాహారం. అయితే ఇవే హక్కులు తరచూ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, సామాజిక వివక్ష, పోలీస్ వ్యవస్థ దుష్ర్పవర్తన వంటి అనేక కారణాల వల్ల ప్రమాదంలో పడుతున్నాయి.

అటువంటి సందర్భాల్లో సాధారణ పౌరుడికి వెంటనే న్యాయం దొరకడం కష్టమవుతుంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు, ప్రభుత్వ వ్యవస్థలపై పర్యవేక్షణ కల్పించేందుకు మానవ హక్కుల కమిషన్లు ఏర్పడ్డాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్సీ) అనేది న్యాయస్థానా లు చేరుకోలేని పరిస్థితుల్లోనూ ప్రజలకు న్యాయం అందించే ఒక శక్తివంతమైన శాసనాపరమైన బలం. ఇలాంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ల పుట్టు పూర్వోత్తరాలేమిటి? వాటి లక్ష్యాలు ఏమిటి? పౌరులు ఏ సందర్భాల్లో ఫిర్యాదు చేయాలి? ఎలా చేయా లి? అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది.

లక్ష్యం, ఆశయాలు..

భారతదేశంలో మానవ హక్కుల రక్షణను మరింత బలోపేతం చేయడానికి 1993లో భారత పార్లమెంట్ ‘మానవ హక్కుల పరిరక్షణ’ చట్టాన్ని ఆమోదించిం ది. ఈ చట్టం ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ర్ట మానవ హక్కుల కమిషన్లు అనే రెండు స్థాయిల్లో స్వతంత్ర విచారణ సంస్థలుగా ఏర్పడ్డాయి. ఇవి ప్రభుత్వానికి లోబడకుండా, స్వతంత్రంగా విచారణ చేసే అధికారం కలిగిన రాజ్యాంగ సమాన సంస్థలుగా పని చేస్తాయి.

మానవ హక్కుల కమిషన్ ముఖ్యంగా పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించడం, ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చే అన్యాయాన్ని అరికట్టడం, హక్కులు ఉల్లంఘించబడినపుడు సత్వర సహాయం అందించడం లాంటివి చేయాలి. అంతేకాదు అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవ హక్కుల విలువ పెంచడంతో పాటు నేరస్థులను చట్టపరంగా బాధ్యులుగా నిలబెట్టే విధంగా సిఫారసులు చేయాల్సి ఉంటుం ది. ‘ న్యాయం కోసం ఎవరు తలవంచకూడదు’ అనే భావనను ప్రజల్లో పెంచాలి. హక్కులు కోల్పోయిన వారిని రక్షించడం, విచారణల్లో పారదర్శకత, వేగం, నిజ నిర్ధారణకు కట్టుబడి ఉండాల్సిన అవస రముంది. 

రక్షణ విధానం..

ప్రజలకు జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ఇవి రాజ్యాంగం ప్రసా దించిన అసలైన మానవ గుణాలు. ఇవి ఎక్కడైనా భంగం కలిగితే, బాధితులు ఒంటరిగా మిగలరాదు. బాధితులు గాని, వారి తరఫు వ్యక్తులు ఎవరైనా హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసుకునే అవకాశముంటుంది.

నిందితులపై కేసులు నమోదు చేయమని సూచించడం, సమగ్ర విచారణకు ఆదేశించడం, మీడియా కథనాలను స్వయంగా విచారణకు తీసుకోవడం లాంటివి చేయా లి. న్యాయస్థానాలు చేరుకోలేని వర్గాలకు సత్వర న్యాయం అందించడం హెచ్‌ఆర్సీ తక్షణ కర్తవ్యం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హ్యూమన్ రైట్స్ కమిషన్ సాధారణ పౌరులకు ఒక న్యాయ ధీమా లాంటిది. సామాన్య ప్రజల్లో ఎవరు ఏ సమస్యలో ఉన్నా హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసే అవకాశముంటుంది.

ఫిర్యాదుల్లో ప్రధానంగా వసతి గృహాల్లో సౌకర్యాల లేమితో, ఆకలితో బాధలు పడేవారు, వైద్య సదు పా యాల నిరాకరణకు గురైన వారు, బాలకార్మికులు, వెట్టి చాకిరి, అంటరానితనం, వివక్షకు గురైన వారు, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యంతో నష్టపోయిన వారు, బూటకపు ఎన్‌కౌంటర్లు, పోలీసు చిత్రహింసలు, అక్ర మ నిర్బంధాలు, కస్టోడియల్ మరణాలు, ఆదివాసీ హక్కుల ఉల్లంఘన, భూ ఆక్రమణలు. తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాల నిరాకరణకు గురైన వారు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, వృద్ధులపై నిర్లక్ష్యానికి గురైన వారు, లంచం కోసం పీడించడం, అధికార దుర్వినియోగంతో నష్టపోయిన వారు, సామాజిక అవ సరాల భూముల కబ్జాలన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పౌరుడికి శ్వాస వంటివి. అవి ఎక్కడైనా కుదేలైతే, అందుకు పరిష్కార మార్గం ఉందని ప్రజలు తెలుసుకోవాలి.

సత్వరమే న్యాయం..

హెచ్‌ఆర్సీ- అనేది భయపడే వారికి ధైర్యం, బాధితులకు న్యాయం, అధికారులకు బాధ్యతలను గుర్తుచేస్తుంది. పోస్ట్‌కార్డు రూపంలో సమస్యలను హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అందుకు ఎలాంటి రుసు ము అవసరం లేదు. స్థానిక లేదా ఏ భాషలోనైనా రాసుకునే వీలుంటుంది. కోర్టుల్లా గా ఇక్కడ విచారణల వాయిదాకు ఆస్కారముండదు.

సివిల్ కోర్టుల తరహా అధికా రాలతో వేగవంతమైన విచారణ, సాక్ష్యులను పిలవడం, ప్రమాణాలు నమోదు చేయడం లాంటివి జరుగుతాయి. మానవ హక్కులు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫార్సులు పంప డంతో పాటు బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ సామాన్య ప్రజల పాలిట రక్షణ కవచంలా మారింది.

  మన హక్కుల రక్షణే మన బలం. హెచ్‌ఆర్సీ అండగా ఉందనే సామాజిక చైతన్యం, అవగాహన  కల్పించడం పాలకుల బాధ్యత. ఇది పారదర్శక పాలనకు సంకేతం. బాధితుల చైతన్యంతో హక్కుల ఉల్లంఘనను  మానవ హక్కుల కమిషన్ సహకారంతో సమూలంగా నిర్మూలించవచ్చు. అంతిమంగా భారతదేశ న్యాయ వ్యవస్థలో జాతీయ మానవ హక్కు ల కమిషన్ అత్యంత ప్రాముఖ్యతను కలిగి  ఉంటుంది. ఇది మానవ హక్కులను ప్రోత్సహించడం ద్వారా పౌరులకు సత్వర న్యాయం కలుగుతుండడం గొప్ప విషయంగా పరిగణించవచ్చు.

 వ్యాసకర్త సెల్: 9573 666650