10 July, 2026 | 6:25 PM

సర్వీసుల స్పీడు

07-05-2024 01:35 AM

14 ఏండ్ల గరిష్ఠానికి వృద్ధి వేగం

న్యూఢిల్లీ, మే 6: భారత్‌లో సర్వీసుల రంగం సంపాదించిన కొత్త వ్యాపారం ఏప్రి ల్ నెలలో జోరుగా వృద్ధిచెందినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివి టీ ఇండెక్స్ ద్వారా వెల్లడయ్యింది. వాస్తవానికి ఈ ఇండెక్స్ మార్చినెలతో పోలిస్తే 61.2 నుంచి 60.8కి తగ్గినప్పటికీ, ఏప్రిల్‌లో గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే సాధించిన వృద్ధి రేటు 14 ఏండ్ల గరిష్ఠానికి చేరినట్టు హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రంజుల్ భండారి చెప్పారు. సర్వీసుల రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ వారి భవిష్యత్ వ్యాపార వృద్ధిని, అంచనాల్ని వెల్లడించే సర్వే ద్వారా ఈ సూచి రూపొందుతుంది. ఈ ఇండెక్స్ 50 ఎగువన ఉంటే సానుకూలంగానూ, ఆ దిగువన ప్రతికూలంగానూ పరి గణిస్తారు. కొత్త ఆర్డర్లు మరింత పెరగడం, దేశీయ డిమాండ్ పటిష్టపడటం ద్వారా వృద్ధి వేగవంతమయ్యిందని భండారి వెల్లడించారు. అయితే పెరుగుతున్న వేతనాలు, ఆహార వ్యయాల ఫలితంగా సర్వీసుల రంగంపై భారం పడుతున్నదని, అందులో కొంత భాగం ఖాతాదారులకు మళ్లిస్తున్నట్టు సర్వేలో వెల్లడయ్యింది.