9 July, 2026 | 9:14 AM

ముళ్ల పొదల్లో భారీగా గంజాయి సంచులు

11-06-2024 12:50 AM

ఖమ్మం , జూన్ 10 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాకేంద్రంలోని  కొత్త బస్టాండ్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో భారీగా గంజాయి సంచులు లభించడం స్థానికంగా కలకలం రేపింది.  కొత్త బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న ముళ్ల పొద ల్లో భారీగా గంజాయి దాచిపెట్టారనే విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుంకరి రమేశ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముళ్ల పోదల్లో దాచిన 39.5 కిలోల గంజాయి ఉన్న సంచులను గుర్తించారు. 

గంజాయి విలువ దాదాపు  రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఎవరైనా గంజాయి అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  గంజాయి కట్టడికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు   నిరంతరం దాడులు చేస్తున్నప్పటికీ  అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి రవా ణా చేస్తూనే ఉన్నారు.