11 May, 2026 | 5:14 AM

బీసీసీఐకి భారీగా ఆదాయం

21-08-2024 12:05 AM

ఐపీఎల్ ద్వారా 116% పెరుగుదల

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి చేరింది. ఐపీఎల్ 2022 సీజన్‌తో పోలిస్తే 2023 సీజన్ మిగులు సంపద 116 శాతం మేర పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నా యి. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తం ఆదాయం రూ. 11, 769 కోట్లుగా నమోదైంది. గత సీజన్ 2021 పోలిస్తే రూ. 5,120 కోట్లు అధికం కావడం విశేషం. 2023 సీజన్ కోసం బీసీసీఐకి మీడి యా హక్కుల ద్వారా రూ. 48, 390 కోట్లు  సమకూరనున్నాయి.

ఇందులో స్టార్ స్పోర్ట్స్ (రూ. 23, 575 కోట్లు), జియో సినిమా (రూ. 23, 758 కోట్లు) టీవీ, డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయి. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను  టాటా సన్స్ రూ. 2500 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. అంతకముందే ఆటగాళ్ల రిటెన్షన్ రూల్‌పై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రైట్ టు మ్యాచ్ కింద ఆయా ఫ్రాంచైజీలు ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేలా బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించే అవకాశముంది.