11 May, 2026 | 4:01 AM

యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్

21-08-2024 12:02 AM

దుబాయ్: అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల దృశ్యా మెగాటోర్నీని నిర్వహించడం కష్టమన్న ఐసీసీ వేదికను యూఏఈకి మారుస్తూ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే బంగ్లాదేశ్ ఆతిథ్య హోదాలోనే బరిలోకి దిగనుందని ఐసీసీ పేర్కొంది. ‘క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్య దేశంగా బంగ్లానే ఉండనుంది. కానీ టోర్నీని మాత్రం యూఏఈలో నిర్వహించనున్నాం’ అని ఐసీసీ సీఈవో జెఫ్ అల్లార్డీస్ తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు దుబాయ్, షార్జా వేదికలు కానున్నాయి. కాగా వారం ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.