11 May, 2026 | 6:27 AM

నేటి నుంచి పాక్, బంగ్లా తొలి టెస్టు

21-08-2024 12:08 AM

రావల్పిండి: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేటి నుంచి షురూ కానుంది. రావల్పిండి వేదికగా ఇరుజట్లు నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. షాన్ మసూద్ నేతృత్వం లోని పాక్ జట్టు బలంగా కనిపిస్తుండగా.. బంగ్లా మాత్రం తమ సీనియర్ ఆటగాడు, ఆల్‌రౌండర్ షకీబ్‌పైనే ఆశలు పెట్టుకుంది. రెండు టెస్టులు కూడా రావల్పిండి వేదికగానే జరగనున్నాయి. ఇక టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై పాక్ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది.