calender_icon.png 22 November, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్‌వర్క్.. 20మందితో కంటెంట్ పోస్ట్

22-11-2025 11:34:02 AM

హైదరాబాద్: ఐబొమ్మ రవి( Ibomma Ravi) వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడో రోజు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime police) విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఐబొమ్మరకి కింద 20 మంది టీమ్ ఉన్నట్లు గుర్తించారు. 20 మందితో ఐబొమ్మ రవి కంటెంట్ పోస్టు చేయిస్తున్నాడు. వ్యూవర్స్ ని పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ కోసం పత్యేక టీమ్ లను ఏర్పాటు  చేశాడు. రెండో విచారణలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్స్ నిర్వహకులతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తూ సహకరిస్తున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. తమిళ, హిందీ వెబ్ సైట్ల ద్వారా సినిమాలను రవి కొనుగోలు చేశాడు. మూవీ రూల్స్ వెబ్ సైట్ నుంచి కూడా రవి సినిమాలు కొనుగోలు  చేసినట్లు గుర్తించారు. క్రిప్పో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బు పంపినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేశాడు.