22-11-2025 10:36:54 AM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్( Rajendranagar Circle)లోని పలు ప్రాంతాల్లో వెలసిన ఫుట్ పాత్ ల ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం ఆరాంఘర్ చౌరస్తాలోని శంషాబాద్ వెళ్లే మార్గంలోని పుట్ పాత్ లపై వెలసిన డబ్బాలు, కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు. అక్కడ ఉన్న తోపుడు బండ్లను సైతం తొలగించారు. అదే విధంగా శివరాం పల్లి లోని పీవీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే(PVNR Expressway) పిల్లర్ నెంబర్ 294 వద్ద గల పుట్ పాత్ అక్రమాణలను తోలగించారు.
ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవంచానీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా మైలార్దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్(Mailardevpally Inspector Narendra), అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు ల ఆధ్వర్యంలో భారీ పోలీసు బండిబస్తును ఏర్పాటు చేశారు. శివరాం పల్లి వద్ద జరిగిన కూల్చివేతల సందర్బంగా పుట్ పాత్ యజమానులు, అధికారుల మధ్య కొద్దీ సేపు వాగ్వాదం జరిగింది. పక్కింటి యజమాని ఫిర్యాదు చేయడంతో కక్ష సాధింపుతోనే మా డబ్బాలను కూల్చివేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.