calender_icon.png 22 November, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జిల్లాలో శిశు విక్రయం కలకలం.. 15 మందిపై కేసు నమోదు

22-11-2025 09:29:25 AM

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) శిశువు విక్రయం కలకలం రేగింది. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్( Karimnagar Two Town PS)లో మగ విశువు విక్రయంపై కేసు నమోదైంది. మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు రోజుల శిశువును రూ. రూ.9 లక్షలకు విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చెందిన యువతి ప్రేమించి మోసపోవడంతో గర్భవతిగా మారింది. అనంతరం కొంతమంది దళారులను ఆశ్రయించింది. మధ్యవర్తుల సాయంతో శిశువు పుట్టగానే కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అమ్మిన, కొన్న వారిపై కేసులు నమోదు చేశారు. శిశువును స్థానికంగా ఉన్న మాతాశిశు కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను శనివారం నాడు కోర్టులో హాజరు పరిచే అవకాశముందని అధికారులు తెలిపారు.