calender_icon.png 22 November, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసిఫ్‌నగర్‌లో గ్యాంగ్ వార్.. నడిరోడ్డుపై హల్‌చల్‌

22-11-2025 10:33:06 AM

హైదరాబాద్: నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో శుక్రవారం రాత్రి రెండు గ్రూపులు మధ్య మారణాయుధాలతో గ్యాంగ్ వార్(Gang war) జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. నేర నేపథ్యం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని సమస్యల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్‌ పోలీస్ స్టేషన్(Asif Nagar Police Station) పరిధిలోని మురాద్‌నగర్ ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అనేక వాహనాలు దెబ్బతిన్నాయని, కొంతమంది కర్రలు, రాళ్లతో దాడి చేశారని స్థానికులు వాపోయారు. 

మురాద్‌నగర్(Muradnagar)  ఇద్దరు వ్యక్తులపై టిప్పు షేర్ గ్యాంగ్ దాడి చేసింది. తమష్, రెహమాన్ పై టిప్పు షేర్ సహా 20 మంది దాడికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ బాధితుడి ఇంటికి వెళ్లి వస్తువులు, కార్లు ధ్వసం చేసింది. నివాస ప్రాంతంలోని వీధుల్లో జరిగిన ఘర్షణను గమనించిన స్థానికులు భయంతో ఇళ్లకు తాళాలు వేసి ఇళ్లలోనే ఉండిపోయారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక పోలీసులు గుంపులుగా కర్రలతో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న గుంపులను గమనించడంలో విఫలమయ్యారని స్థానిక ప్రజలు ఆరోపించారు. బాధితుల కుటుంబ సభ్యుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.