calender_icon.png 22 November, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబిన్ హుడ్ రవి అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

22-11-2025 11:28:39 AM

నేను కూడా పైరసీ కంకెంట్ చూస్తా...

100 మందిని అరెస్ట్ చేయాలని సూచన

హైదరాబాద్: పైరసీ కంటెంట్ పైనా, ఐబొమ్మ రవిపైనా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ట్వీట్ చేశారు. ఐబొమ్మ రవిని రాబిన్ హుట్ అని పోల్చడాన్ని ఆర్టీవీ తప్పుబట్టారు. రాబిన్ హుడ్ హీరో కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు. పైరసీ చేసేవారిని పట్టుకోవడం కష్టం.. చూసేవారిని పట్టుకోవడం ఈజీ అన్నారు. సమయం ఆదా కోసం నేను కూడా పైరసీ కంటెంట్ చూస్తానని ఆర్టీవీ వెల్లడించారు. పైరసీ సమస్యలకు పరిష్కారం ఉందని రాంగోపాల్ వర్మ తెలిపారు. అలా చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేయాలని సూచించారు. పనిచేసేది భయం మాత్రమే.. నైతిక విలువలు కావని చెప్పారు. 

పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం వల్ల లేదా పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండటం వల్ల కాదు, కానీ పైరేటెడ్ సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత వరకు వారికి సేవ చేయడానికి రవిలు ఎల్లప్పుడూ ఉంటారు. రవి ఇండస్ట్రీకి కోట్ల నష్టాన్ని తెచ్చాడని ప్రొడ్యూసర్స్ ఆరోపించారు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్ట విరుద్ధం అన్నారు. రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడొద్దని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. రవిని హీరోగా చూడటాన్ని సినీ ఇండస్ట్రీ తీవ్రంగా ఖండించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని(iBomma Ravi) మూడో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో రవి సరిగ్గా సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవికి సంబంధించిన ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. డబ్బుల కోసమే బెట్టింగ్‌ యాప్‌ ప్రమోట్‌ చేసినట్లు ఐబొమ్మ రవి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


https://twitter.com/RGVzoomin/status/1992064244167401735