30-10-2025 08:26:38 AM
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
వలిగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని(Valigonda Mandal Center) మూసీ వంతెన(Musi Bridge) సమీపంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో బీటీ రోడ్డు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు భారీ గుంతలను తప్పించలేక ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించకపోవడంతో అందులో పడి పలు వాహనాలు దెబ్బతినడం జరిగింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే గుంతలు మరింత పెద్దవై ప్రాణ నష్టం సంభవించక ముందే అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చివేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.