30-10-2025 08:24:01 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని(Bejjur mandal) లంబడిగూడ గ్రామంలో జిల్లా ఎస్పీ కాంతి లాల్ పాటిల్, ఎస్డిపిఓ వహీదుద్దీన్ ఆదేశాల ప్రకారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కౌటాల సర్కిల్ సిఐ, సిర్పూర్ టి, కౌటాల, చింతనపల్లి,బెజ్జూర్ మండలాల ఎస్సైలు ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలసి , కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించగా 40 లీటర్ల గుడుంబా ,1000 లీటర్ల బెల్లం పానకం,5 పత్రాలు సరిగా లేని వాహనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి, గుడుంబా పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కౌటాల సర్కిల్ సిఐ బి సంతోష్ కుమార్ గుడుంబా వల్ల జరిగే నష్టాలు అది తయారీ అయ్యే విధానం గురించి మాట్లాడి ప్రజలు దానికి దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. కొత్తగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.