1 April, 2026 | 6:34 PM

Breaking News

మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •  

ట్రంప్ కుటుంబానికి కనక వర్షం

03-02-2026 01:44 AM

క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో భారీగా లాభాలు

2024లో వరల్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఏర్పాటు

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: క్రిప్టో కరెన్సీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ఆ కుటుంబం భారీగా లాభాలను అర్జిస్తున్నది. గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌తో ట్రంప్ ఫ్యామిలీకి వాటాలున్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తాజాగా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తోనూ ఒప్పందం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.  ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా మరో నాలుగు రోజుల్లో ప్రమాణస్వీకారం చేస్తారనగా యూఏఈతో ఒప్పందం జరిగింది.

అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరి 20న రెండోసారి ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాని విలువ మరింత వేగంగా దూసుకెళ్లింది. యూఏఈ పాలిత కుటుంబానికి చెందిన షేక్ తహనూన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఆ సంస్థలో మొత్తం 49 శాతం వాటాలను (500 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వాటాలు కొనుగోలు చేసిన వ్యక్తులు ముందస్తుగా సగం సొమ్ము చెల్లిస్తారు. ఇందులో ట్రంప్ ఫ్యామిలీ ఖాతాల్లోకి 187 మిలియన్ డాలర్లు వెళ్తాయి. ఒప్పందం ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా సంతకం చేశారు. ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి యూఏఈకి ఏఐ హార్డ్‌వేర్ అందనుంది.

అంతకుముందు జోబైడెన్ హయాంలో దీనికోసం ప్రయత్నించినా వీలుకాలేదు. స్పైషేక్‌గా పేరుపొందిన షేక్ తహనూన్.. యూఏఈ అధ్యక్షుడి సోదరుడు. అలాగే జాతీయ భద్రతా సలహాదారు. ప్రభుత్వానికి చెందిన వెల్త్‌ఫండ్‌కు అధిపతి కూడా.ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లుడు జేరెడ్ కుష్నర్‌లు కలిసి 2024లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు. దీంతోపాటు ఎరిక్, డొనాల్డ్ జూనియర్‌లు అమెరికన్ బిట్ కాయిన్ ఇన్‌కార్పొరేటెడ్ పేరిట ఓ బిట్‌కాయిన్ మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ప్రతినిధులు గత ఏడాది ఏప్రిల్‌లో పాక్‌కు వచ్చి ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సమక్షంలో ‘పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్’తో ఒప్పందం చేసుకొన్నారు.