03-02-2026 01:42:53 AM
అబుజ్‌మడ్ అడవుల్లో పేలుడు పదార్థాలు
ఐఈడీని నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
చర్ల, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా ఆబుజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టుల భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే ఒక ఐఈడీ ధ్వంసం చేశాయి. అబుజ్‌మడ్ భోటోర్ అటవీ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంపును, ప్రెషర్ కుక్కర్ ఐఈడీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, ఖాళీ పెద్ద డ్రమ్ములు, రేషన్ సామాగ్రి, దుస్తులు, రోజువారీ ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి.