03-02-2026 01:47:11 AM
తెలంగాణకు రైల్వేబడ్జెట్ రూ.5,454 కోట్లు
మూడు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు
ఈ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్‌గా నిర్మిస్తాం
రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: హైస్పీడ్ రైల్వే హబ్‌గా హైదరాబాద్ మారుతుందని, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.5,454 కోట్ల నిధులు కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చామని రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విష యం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ రూ.53,47,315 కోట్లుగా, రైల్వే బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లుగా కేటాయించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రా ష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులతోపాటు నిధుల కేటాయింపులను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీలో విలేకర్లతో వివరించారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.5,454 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. అలాగే మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఇచ్చామని చెప్పారు. అవి హైదరాబాద్ - (2.30 గంటల ప్రయాణం), హైదరాబాద్ (2:55 గంటలు), హైదరాబాద్ (1:45 గంటలు) అంటూ వివరిం చారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్‌లుగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. హైస్పీడ్ రైల్వే కు హైదరాబాద్ మహానగరం హబ్‌గా అవతరిస్తుందని స్పష్టం చేశారు.
ఇది సౌత్ ఇండి యా డైమండ్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కంటే అధికంగా తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులకు నిధు లు కేటాయించామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. అయినా 2026- బడ్జెట్ లో కేంద్రం మొండి చేయి చూపిందంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పలువురు అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. అలాంటి వేళ రైల్వే శాఖ ద్వారా తెలంగాణకు జరిగిన బడ్జెట్ కేటాయింపులను ఆ శాఖ మంత్రి వివరించారు.