02-02-2026 12:25:15 AM
22, 6వ వార్డులో ఎమ్మెల్యే వార్డులల్లో ఇంటింటి ప్రచారం
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): పుర ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం వనపర్తి పట్టణంలోని 22 వ వార్డు, 6 వ వార్డుల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మార్నింగ్ వర్క్ చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి తమ వార్డు కు వచ్చిన ఎమ్మెల్యేకు ఆయా వార్డులలోని మహిళలు, పెద్దలు యువకులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించి 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న చీర్ల సత్యం గారిని, 6 వ వార్డు లోనూ హస్తం గుర్తుపై తమ విలువైన ఓటును వేసి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో వనపర్తి పట్టణం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలయంలో పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందని పట్టణంలో ఇప్పటికే రూ 100 కోట్ల పనులు చేపట్టి ప్రతి గల్లీలో సిసి రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపట్టేమన్నారు.ప్రతి వార్డులో కమ్యూనిటీ హాల్స్ ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు, సన్న బియ్యం ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులు మహిళలకు చిత్త ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం, మహిళల ఆర్థిక సోవాలమ్మ కోసం క్యాంటీన్లో ఏర్పాటు, కుట్టు మిషన్ల పంపిణీ, మహిళను గౌరవించుకునే విధంగా ఇందిరమ్మ చీరల పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టి నిరు పేదలకు ఇందిరమ్మ రాజ్యం వెన్ను దన్నుగా నిలుస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్దలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.