18 June, 2026 | 3:35 AM

తిప్పేసిన శ్రీచరణి

18-06-2026 02:22 AM

నెదర్లాండ్స్‌పై భారీ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్

లీడ్స్, జూన్ 17 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన 47 బంతుల్లో 74( 11 ఫోర్లు, ఒక సిక్సర్), షెఫాలీ వర్మ 38 బంతుల్లో 55(10 ఫోర్లు)రన్స్ చేశారు.

210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. శ్రీ చరణి (4/19 ) దెబ్బకు నెదర్లాండ్స్ ఇన్నిం గ్స్ పేకమేడలా కూలింది. ఆమెకు షఫాలీ వర్మ 3/20 కూడా తోడవ్వడంతో నెదర్లాండ్స్ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. మిగతా భారత బౌలర్లలో నందిని శర్మ 2, దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టారు.  జూన్ 21న జరిగే తమ మూడో మ్యాచ్‌లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది.