21-01-2026 12:00:00 AM
50వ రోజుకు చేరిన ఎర్రవల్లి గ్రామస్తుల నిరాహార దీక్షలు
చారకొండ, జనవరి 20: నిరాహార దీక్షలు చేపట్టి 50 రోజులు గడుస్తున్నా తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు అన్నారు. డిండి - నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ లో ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రీలే నిరహార దీక్షలు మంగళవారం 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఏలాంటి ప్రయోజనం లేని రిజర్వాయర్ ను సామర్థ్యం తగ్గించి తమ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ ను సాధించే వరకు ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్, పెద్దయ్య, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.