23 July, 2026 | 1:40 AM

రైతులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష

23-07-2026 01:10 AM

భూముల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్

ఇబ్రహీంపట్నం, జూలై ౨౨ (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి‘ రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ ఆధ్యర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా భూ ముల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ.. పారిశ్రామిక పార్కు కో సం సర్వే నెంబర్లు 19, 68, 127లలో మొత్తం 677.29 ఎకరాల భూమిని అధికారులు సర్వే చేశారని, అయితే ఆ సర్వేలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. రైతు ల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని, కబ్జాలో ఉన్న భూములకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్ట మైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

దీక్షా శిబిరాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, యాచారం సీఐ, ఎస్‌ఐలు సందర్శించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే, ‘రైతుల హక్కుల కోసం మా పోరాటం ఆగదు. బాధితులకు, రైతులకు పూర్తిస్థాయిలో న్యా యం జరిగే వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉంటాం‘ అని రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ స్పష్టం చేశారు.