23 July, 2026 | 1:48 AM

మూడు నెలలలోపు రెండు సంఘటనలు..

23-07-2026 01:11 AM

భయాందోళనలో నగర వాసులు..

కరీంనగర్,జూలై22(విజయక్రాంతి):గత మే నెలలో సంచలనం సృష్టించిన పి.ఎం.జె  జ్యువెలరీ షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించి, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అదే తరహాలో తాజాగా భగత్ నగర్ లోని నివాస గృహంలో జరిగిన దోపిడీ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.  మూడు నెలల లోపు జరిగిన ఈ రెండు సంఘటనలతో నగర వాసులు భయాందోళనలకు లోనవుతున్నారు.

అర్ధరాత్రి పోలీసులు గస్తీ ముమ్మరం చేయాలని కొరితున్నారు. భగత్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. సుమారు 8 మంది ముసుగు దొంగలు అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడి నకిలీ తుపాకులు, కత్తులతో బెదిరించారు.గంటన్నరకు పైగా కుటుంబ సభ్యులను కట్టేసి, 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకెళ్లారు. దీనికి ముందు, గత మే నెలలో జ్యోతి నగర్ లోని పీఎంజే  జ్యువెల్లరీ షాపులో జరిగిన కాల్పులు  భారీ చోరీ ఘటనలు నగరంలో తీవ్ర కలకలం రేపాయి..

పి ఎం జె కేసును ఛేజించిన తరహాలోనే తాజా ఘటనపై క్లూ టీమ్ ను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. పి ఎం జె దోపిడీ దొంగలు బీహార్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు కాగా భగత్ నగర్ సంఘటన కు పాల్పడింది బాధితుల బందువుగా అనుమానిస్తున్నారు అయితే ఆయనకు సహకరించింది  దోపిడీ ముఠా అయివుంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.