23 July, 2026 | 1:42 AM

నగరంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్

23-07-2026 01:09 AM

కరీంనగర్, జూలై 22 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ‘ సఫాయి అప్నా... బీమారీ భగావో‘ కార్యక్రమంలో భాగంగా నగరంలో ‘ స్పెషల్ డ్రైవ్‘ చేపట్టారు. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన టవర్ సర్కిల్ ప్రాంతం మార్కెట్ ఏరియాలో కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులను భాగస్వామ్యం చేస్తూ చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రధాన గార్బేజ్ పాయింట్లలో పేరుకుపోయిన దాదాపు 3 టన్నుల చెత్తను కార్మీకులు, సిబ్బంది తొలగించారు.

నగరాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో వ్యాపారులు, స్థానిక ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. ప్రస్తుత వర్షకాలంలో నగర పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు వస్తాయని... ఎప్పటికప్పుడు చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య అధికారులు, కార్మీకులు పాల్గొన్నారు.