calender_icon.png 23 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాభర్తల మధ్య గొడవలు.. ఉరి వేసుకొని భర్త ఆత్మహత్య

22-07-2025 10:47:38 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): భార్యాభర్తల మధ్య గొడవలు.. ఉరివేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్రిగూడ మండల పరిధిలోని కమ్మ గూడెం గ్రామపంచాయతీ పరిధిలో బొజ్యా తండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరంటోతు బిక్కు(27) అలియాస్ అనిల్ నాయక్ మంగళవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ పడుతుండేవారని స్థానికులు తెలిపారు. మృతుడు అనిల్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్ మృతిపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తానని మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.