22-07-2025 10:49:40 PM
నూతనకల్ (విజయక్రాంతి): మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసరావు(Tahsildar Srinivasa Rao) ప్రజలకు సూచించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసరం ఉంటే తప్ప వర్షంలో రైతులు, ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గ్రామాలలో పారిశుధ్యం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.