23-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 22 (విజయ క్రాంతి): దివ్యాంగుల సమస్యల్ని, భావాన్ని అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు సైన్ లాంగ్వేజి ఎంతగానో ఉపయో గపడుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వ నరుల శిక్షణ కేంద్రం పరిధిలోని కలెక్టరేట్ లో గల ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో అధికారులకు ‘బేసిక్ ఇండియన్ సైన్ లాంగ్వేజి‘ శిక్ష ణను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల్ని, వారి భావాన్ని సరిగ్గా అర్థం చేసుకునేందుకు సైన్ లాంగ్వేజి ఉపకరిస్తుందని అన్నారు. అందుకే జిల్లా జిల్లాలో మొద టగా జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్ర పుల్ దేశాయి, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ మహేశ్వర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.