calender_icon.png 27 October, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

25-10-2025 12:46:06 AM

ఏన్కూర్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): ఏన్కూర్ మండలం నాచారం గ్రామంలో అక్రమ సంబంధం అనుమానం నెపంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఏన్కూర్ మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్ధన గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

గత కొంతకాలంగా భార్య తాటి గోవర్ధన(32) అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే నెపంతో శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో భర్త తాటి రామారావు తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు అనంతరం హత్యకు ఉపయోగించిన గొడ్డలి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకొని  లొంగిపోయాడు . మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. సంఘటనా స్థలానికి వి యం బంజర సీఐ, ముత్తిలింగం, ఏన్కూర్ ఎస్త్స్ర సంధ్య చేరుకొని కేసు నమోదు చేసారు.