calender_icon.png 26 October, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి సంపదను దోచుకోవడం కోసమే..

25-10-2025 12:45:50 AM

పార్టీలు మారుతూ సానుభూతి మాటలు

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ అక్టోబర్ 24 (విజయ క్రాంతి) : రాజకీయ జీవితంలో తన స్వార్థం కోసమే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలు మారుతారని బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పది మంది బిఆర్‌ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ బిఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నమని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు.

బాన్సువాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా పదవులు అనుభవించి రాజకీయ జీవితంలో తన స్వార్థం కోసమే పార్టీలు మారాడని ప్రజలకు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారానని సానుభూతి మాటలు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రకృతి సంపదను దోచుకోవడం కోసమే పార్టీలు మారుతూ ఆర్థికంగా ఎదగడమే తప్ప ఆయన వెంట ఉన్న నాయకులు కార్యకర్తలను ఉన్నత స్థాయిలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎదిగనివ్వకుండా ఆయన చేతుల్లోనే ఉంచుకోవడం జరుగుతుందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులు ప్రజలు అభివృద్ధి చెందారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క రైతు గాని ప్రజలు గాని సంతోషంగా లేరని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.  వచ్చే ఉప ఎన్నికల్లో పదిమంది ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా రావని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోచారం పై తాను పోటీ చేస్తానని పోచారం కు డిపాజిట్లు కూడా రావని గల్లంతవుతాయని ఆయన పేర్కొన్నారు.  ఇప్పటికైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో మాజీ రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నార్ల రత్నకుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు గణేష్ సాయిబాబా ఇషాక్ చందర్ మొగులయ్య రమేష్ యాదవ్, మౌలా సాయిలు తదితరులున్నారు.