calender_icon.png 7 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య ప్రైవేట్ ఫోటోలను ఇన్‌స్టాలో పెట్టిన భర్త... ఫినాయిల్ తాగిన భార్య

07-08-2025 09:44:25 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్(Ramgopalpet Police Station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అవమానిస్తూ ఓ భర్త ఇన్ స్టాగ్రామ్ లో పోటోలు పోస్టు చేశాడు. భార్య ప్రైవేటు ఫొటోలను భర్త బీమ్ రాజ్ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ ఇన్ స్టాలో పెట్టాడు. మూడు నెలల క్రితమే భీమ్ రావు ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిన భీమ్ రాజ్ భార్య మనస్తాపంతో ఫినాయిల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.