calender_icon.png 7 August, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సుంకాలపై స్పందించిన ప్రధాని మోదీ

07-08-2025 12:16:09 PM

  1. ట్రంప్ టారిఫ్ వార్పై స్పందించిన ప్రధాని మోడీ.. 
  2. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడదు.. 
  3. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం..
  4. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని నాకు తెలుసు.. 
  5. దేశం కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం..

న్యూఢిల్లీ: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు(Trump Tariffs) మళ్లీ పెంచడంపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని సూచించారు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాలని తనకు తెలుసన్నారు. రైతుల ప్రయోజనాల కోసం భారీ మూల్యానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

భారమైనప్పటికీ రైతులకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామని తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. అటు మరోసారి భారత్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్(Donald Trump warning) ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకుంటే మరింత టారిఫ్ వేస్తామని హెచ్చరించారు. రెండో విడత టారిఫ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఇండియాపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31 శాతం, చైనా కంటే 20 శాతం ఎక్కువ టారిఫ్స్ విధించారు. గత నెల విధించిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమలు కానున్నాయి. మరో 25 శాతం సుంకాలు ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి రాన్నాయి.