calender_icon.png 7 August, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

07-08-2025 10:45:11 AM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) కేంద్రంలో గురువారం నాడు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో తాటి చెట్టుపై భారీ పిడుగు పడడంతో చెట్టు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అప్పుడే కల్లుగీత కోసం వెళ్లిన గీత కార్మికుడు చెట్టు కిందికి దిగన తర్వాత చెట్టుపై పిడుగు పడడంతో గీత కార్మికుడు రంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. భారీగా వర్షం కురవడంతో పెద్దపల్లి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.