calender_icon.png 7 August, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిమయంగా ఘట్‌కేసర్‌ మున్సిపల్ కార్యాలయం

07-08-2025 10:51:13 AM

ఘట్ కేసర్: ఘట్ కేసర్ మున్సిపల్ కార్యాలయం(Ghatkesar Municipal Office) అవినీతిమయంగా మారిందని ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆరోపించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో  డబ్బులు చెల్లిస్తే కానీ పనులు జరగడం లేదన్నారు. సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకుపోతే స్వయంగా వాటిని పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బేకాతర్ చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్ లో బొబ్బలి శ్రీకాంత్ రెడ్డి ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఆ ఇంటి కి సంబంధించిన పన్ను పూర్తిగా చెల్లించి ఇల్లు తొలగించిన ఇంటి పన్ను వేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేసిన ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో ఏ పని జరగాలన్న సెటిల్మెంట్ వ్యవహారం నడుస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ కట్టిన వారిని కూడా ఏదో ఒక వంకతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తనకు తెలిసిందని పేర్కొన్నారు. కమిషనర్ వెంటనేఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారితో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటి నెంబర్ల కోసం  దరఖాస్తులు చాలా పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అందులో ప్రధానంగా మహిళ ఔట్ సోర్స్oగ్ ఉద్యోగే హవా నడిపిస్తున్నట్లు తెలిసిందన్నారు. గతంలో కూడా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరిగాయని కమిషనర్ ఇకనైనా గత అవినీతి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందన్నారు.