calender_icon.png 5 August, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరకట్న మరణానికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

05-08-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): అదనపు వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసి, ఆమె ఉరి పెట్టుకుని మరణించడానికి కారణమైన భర్తకు పది సంవత్సరాల కఠిన కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ సోమవారం తీర్పు వెలువరించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు... కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన బొమ్మల బాగవ్వ లస్మయ్య ల కూతురు మౌనిక వివాహం నిజామాబాద్ జిల్లా మొగుపాల్ మండ లం మంచిప్ప గ్రామ నివాసుడైన జల్లాపురం సాయి కుమార్ తో 26 జూన్, 2021 న వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కలిగాడు. అదనపు వరకట్నం కోసం భర్త, అత్త నవనీత లు మౌనిక ను శరీరక, మానసిక హింసలకు, వేధింపులకు గురి చేసేవారు.

అదనపు వంట సామాను, కళ్యణ లక్ష్మీ పథకంలో సగ భాగం ఇవ్వాలని వేదించేవారు. ఈ విషయంలో కులపెద్దలులతో పంచాయతీ నిర్వహించి ఒప్పించారు. అయిన అత్తింటి వేధింపులు ఆగలేదు. భర్త, అత్త వేధింపులు భరించ లేని మౌనిక 28 జులై, 2023న అత్తారింటిలోనే నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక తల్లి భాగవ్వ పిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించుకుని నేర విచారణ పూర్తి చేసి సమగ్ర అభియోగ పత్రం అప్పటి నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు.

నేర న్యాయ విచా రణలో భాగంగా సాక్షుల వాoగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ కోర్టు, ధ్రువీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకు న్నది. అన్నిటిని అధ్యయనం చేసిన సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ ప్రథమ ముద్దాయి సాయికుమార్‌పై అదనపు వరకట్నం కోసం వేధించి మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైనే నేరారోప ణలు రుజువైనట్లు నిర్దారిస్తూ అతనికి పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధించారు.

భార్యను మానసిక, శరీరక హింసలకు గురి చేసినందుకు  భారత శిక్షస్కృతి సెక్షన్ 498 (ఎ )ప్రకారం మూడడేండ్ల  జైలుశిక్షను ఖరారు చేశారు.రెండవ ముద్దాయి అయిన మౌనిక అత్త నవనీతపై నేరారోపణలు రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేశారు.