calender_icon.png 11 May, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనికులకు సంఘీభావంగా హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ

10-05-2025 09:58:40 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): భారత సైనికులకు సంఘీభావంగా కరీంనగర్ జిల్లాహుజురాబాద్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్థానిక హై స్కూల్ క్రీడా మైదానం నుండిపలు వీధుల గుండా జాతీయ జెండాలను చేత భూని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, జై జవాన్, అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా కు చేరుకొని మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దాయదీ దేశానికి వనుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో భారతీయులు అందరు ఒక్కటై భారత ఆర్మీ కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్,సెక్రటరీబోడిగ తిరుపతి, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, గుడ్డేలుగుల సమ్మయ్య,వేముల రవికుమార్, భూసారపు శంకర్, ఎండి యూసుఫ్, ఎండి సంజు, నిమ్మటూరి సాయి కృష్ణ, మాటూరి రాజేష్, కాయ కంటి రాజేష్, సబ్బని విక్రం, కోచ్ మోటపోతుల విక్రం, వినయ్, విపుల్, రాజ్ కుమార్, వంశీ, రాజ్ కుమార్ తోపాటు క్రీడి యూసుఫ్, ఎండి సంజు, నిమ్మటూరి సాయి కృష్ణ, మాటూరి రాజేష్, కాయ కంటి రాజేష్, సబ్బని విక్రం, కోచ్  మోటపోతుల విక్రం, వినయ్, విపుల్, రాజ్ కుమార్, వంశీ, రాజ్ కుమార్ తోపాటు క్రీడాకారులు  పాల్గొన్నారు.