calender_icon.png 11 May, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమర జవాన్ల త్యాగాలు వృథా కావు

10-05-2025 09:54:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు వృధా కావని స్థానికులు పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన జవాన్ మురళి నాయక్ కు శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో స్థానికులు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో తెలుగు బిడ్డ వీరమరణం పొందడం బాధాకరమన్నారు. సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరువబోరని తెలిపారు. జవాన్ల త్యాగాల వల్లే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఆర్కె రామకృష్ణ, ఎన్నమనేని శ్రీనివాసరావు, ధరావత్ జై సింగ్ నాయక్, కర్నే నాగరాజు, కుర్ర శ్రీనివాస్, లకావత్ యాదగిరి నాయక్, అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మాలోత్ సురేష్ బాబు, మాలోత్ సోమేశ్వర్, గుగులోతు అరుణ్ నాయక్, సుంచు మురళి,సాయినాథ్, ఈదునూరి ప్రసాద్, శశి కుమార్, గద్దల మురళి తదితరులు పాల్గొన్నారు.