6 April, 2026 | 4:59 AM

క్రీడల్లో దేశానికి రోల్‌మోడల్‌గా హైదరాబాద్

06-04-2026 02:08 AM
  1. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయామన్న సీఎం రేవంత్‌రెడ్డి
  2. స్పోర్ట్ హబ్ మీటింగ్‌లో పలు సూచనలు
  3. హాజరైన కావ్యా మారన్, సంజీవ్ గోయెంకా, ఉపాసన

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రపంచంలో అత్యుత్తమ క్రీడావేదికగా గచ్చిబౌలీ స్టేడియా న్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ లీలా హోటల్‌లో జరిగిన సోర్ట్స్ హబ్ బోర్డు సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమా వేశంలో సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్యా మారన్, సంజీవ్ గోయెంకా, సి.శశిధర్, జయే శ్ రంజన్, స్పోర్ట్స్ ఎండి సోనీబాలాదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. పలు సూచనలు చేశారు. క్రీడల్లో దేశానికి రోల్‌మోడల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నారు. జూన్ 2న గచ్చిబౌలీ స్టేడియం డెవలప్‌మెంట్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ లోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలీ స్టేడియంలో హెలీప్యాడ్‌తో సహా అన్ని ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

క్రీడాకారులు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. గచ్చిబౌలీ స్టేడియానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బంగులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్చర్‌ను నియమించామని, స్టేడి యం అభివృద్ధిపైన బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. దీర్ఘకాలంలో తెలంగా ణలో క్రీడల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.