8 March, 2026 | 3:49 AM

ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్

08-03-2026 12:32 AM
  1. నగరంలో అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టం
  2. 400 జీసీసీలతో 3 లక్షలకుపైగా వృత్తి నిపుణులకు ఉపాధి
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): కృత్రిమ మేథా (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫిక్కి నిర్వహించిన సీఎఫ్‌వోల సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు.

ప్రపంచంలోని ప్ర ముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తు న్నాయని తెలిపారు. కృత్రిమ మేథా టెక్నాలజీ పాత్రను పూర్తిగా మార్చేస్తోందని, ఇప్ప టి వరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ, ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహా యపడుతోందని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టంలలో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

వ్యాన్ గార్డ్, యూబీఎస్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మాస్ మ్యూచువల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జేపీ మోర్గాన్ చేస్, గోల్ మ్యాన్ శాక్స్, సిటీ గ్రూప్ లాంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు నగరంలో భారీ టెక్నాలజీ, అనలిటిక్స్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయని వివ రించారు. నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మూడు లక్షల మందికిపైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని, తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు ఏటా దాదాపుగా 40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

తదుపరి దశ విస్తరణ కోసం ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐకేఏఎంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు.  సదస్సులో మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, నిర్మాత, విజ్ణాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు, ఫిక్కి సీఎఫ్‌వో కౌన్సి ల్ చైర్మన్ రజనీష్ జైన్, కో చైర్మన్ సుబ్బయ్య కుమార్, విజ్ణాన జ్యోతి సంస్థల సీఈవో, మాజీ డీజీపీ అనురాధ  పాల్గొన్నారు.