11-12-2025 01:15:03 AM
2034 నాటికి 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి
రూ.వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు
గూగుల్ స్టార్టప్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాం తి): హైదరాబాద్ స్టార్టప్ హబ్‌గా ఎదగడంతోపాటు ఇక్కడి కంపెనీలు యూనికార్న్ కంపె నీలుగా ఎదగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం టీ-హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికారన్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలుగా ఎదగాలని, 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కం పెనీలుగా ఎదగాలని చెప్పారు.
అందుకోసం రాష్ట్రంలో ఎకోసిస్టమును సృష్టించాలనుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని, స్టార్టప్‌ల కోసం తమ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఫండ్స్‌ను వినియోగించుకోవాలని, తద్వారా స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటి అని తెలిపారు.
యువకులు శక్తివంతుల ని, సాధారణంగా మీ కలలను సాకా రం చేసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత ఆశయాలతో 1998 లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గారేజీలో ప్రారంభించిన స్టార్టప్ నేడు ప్రఖ్యాత గూగుల్ కంపె నీగా అవతరించిందని వివరించి స్ఫూర్తిని కలిగించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని గత రెండు రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్ ఆవి ష్కరించామని స్పష్టం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్టప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయని, గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ ఇలాంటి గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని వివరించారు.
గత 25 సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా చాలా స్టార్టప్‌లు పెద్ద కం పెనీలుగా ఎదిగాయని గుర్తు చేశారు. ‘తెలంగా ణ రైజింగ్ విజన్ స్టార్టప్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే.. స్టార్టప్‌ను ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతా. నేను ఆ ఆట ఆడతాను.
ఫుట్‌బాల్ ఆటలో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీమ్ వర్క్. కానీ చివరకు గెలుపు చాలా ముఖ్యం. స్టార్టప్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ రోజు నుంచి హైదరాబాద్ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్స్, ఇన్నోవేటివ్ స్టార్టప్స్, ఐపీ ఇంటెన్సీవ్ స్టార్టప్స్ వీటి పైనే దృష్టి పెట్టాలి’ అని సూచించారు.
యూనివర్సిటీల్లో ‘ఇంక్యూబేషన్’ సెంటర్లు: మంత్రి శ్రీధర్‌బాబు
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూని వర్సిటీల్లో ‘ఇంక్యూబేషన్’ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలనే లక్ష్య సాధనలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ ‘వన్ హబ్’ కు ధీటుగా ఈ కేంద్రాలను తీర్చి దిద్దుతామన్నారు. స్టార్టప్‌లను సమాజం ఎదు ర్కొంటున్న అనేక సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందిస్తూ... కొత్త ఉద్యోగాలను సృష్టించే ‘ఎకనామిక్ ఇంజిన్స్’గా చూస్తున్నామన్నారు.
2024లో ఇక్కడి స్టా ర్టప్‌లు 571 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 160 శాతం అధికమన్నారు. హెల్త్‌టెక్ రంగంలో 2,139% వృద్ధి నమోదు అయిందన్నారు. మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌ల్లో హైదరాబాద్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందన్నారు. 531 వుమెన్ లెడ్ స్టార్టప్‌లు 417 మిలియ న్ డాలర్ల నిధులను సమీకరించాయ న్నా రు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కా దని, తమ ప్రభుత్వ పనితీరుకు, ప్రగతిశీల విధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.