11-12-2025 01:31:08 AM
కుల సంఘాలకు తాయిలాలు
రాత్రి వేళల్లో బేర సారాలు
ఊపందుకున్న పంచాయతీ సంగ్రామం
పల్లెలో పంచాయతీ సంబరం
నేడు మొదటి విడత ఎన్నికలు
బాన్సువాడ, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో పంచాయతీ సంగ్రామం రోజురోజుకు ఊపందుకుంటుంది. ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా అప్పుడే సర్పంచ్,వార్డ్ మెంబర్లు సిట్టింగ్లకు అవకాశం కల్పించారు. మందులో దించి వారికి అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇటు సిట్టింగ్లు... అటు కీలక నేతల సెట్టింగ్లతో పంచాయతీ సమరం మరింత రసవత్తరంగా మారుతుంది. నామినేషన్లు వేయకముందే ప్యానెల్ నిర్ధారణ కాకముందే ఆయా గ్రామ సర్పంచుల పోటీలో ఉన్న వ్యక్తులు తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని ఇంటింటికి మందు వాటిలను సప్లై చేయడం జరుగుతుంది.
అతివలదే పై చేయి...
పంచాయతీ ఎన్నికల్లో అతివ లదే పైచేయిగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. మహిళలు ఆశీర్వదించే అభ్యర్థి గెలిచే పరిస్థితి నెలకొంది. జిల్లాలో పంచాయతీ ఓటర్లను పరిగణలో తీసుకుంటే 6,39,730 ఓటర్లు కాగా, అందులో పురుష ఓటర్లు 3,7508 మంది ఉండగా, మహిళా ఓటర్లు 3,32,209 ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓట్లే అధికంగా ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయతీలో మహిళలు ఎన్నుకున్న అభ్యర్థి మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో ఇప్పటికే మొదటి రెండో విడత నామినేషన్ల పర్వం ముగిసింది. బరిలో నిలవాల్సిన అభ్యర్థులు గ్రామ సర్పంచ్లైన, వార్డు సభ్యులైన తమ వార్డుల్లో ఉనికిని బట్టి బర్లోకి దిగుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో మహిళా ఓటర్లది కీలకంగా కావడంతో బరిలోకి దిగే అభ్యర్థులు వారి ఆశీర్వాదం తీసుకొని నామినేషన్లు వేసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాలు ఇవే..
బాన్సువాడ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు* హక్కును వినియోగించుకునే పురుష ఓటర్లు, 14,709 ఉండగా, మహిళా ఓటర్లు 15,344 ఉన్నారు. బికనూర్ పురుషులు 18,709, కాగా మహిళలు 20,404 మంది ఉన్నారు. బీర్కూర్ మండలంలో పురుషులు 9532 మంది ఉండగా 10688 మంది ఉన్నారు. బీబీపేట మండలంలో పురుషులు పదివేల ముగ్గురు ఉండగా, 10 802 మంది ఉన్నారు.
దోమకొండ పురుషులు 11548 మంది ఉండగా, 12918 మంది ఉన్నారు. బిచ్కుంద మండలంలో 13,984 మంది పురుషులు ఉండగా, 14,557 మంది మహిళలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గాంధారి, దోమకొండ, లింగంపేట్, కామారెడ్డి, జుక్కల్, నాగిరెడ్డిపేట్, నసురుల్లాబాద్, పెద్ద కొడప్గల్, పిట్లం, రాజంపేట, రామారెడ్డి, పాల్వంచ, మాచారెడ్డి మాచారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్ నగర,, డోంగ్లి, మద్నూర్, ఎల్లారెడ్డి, తాడువాయి, సదాశివ నగర్ మండలాల్లో కూడా అతివల ఓట్లే అధికంగా ఉన్నాయి.
చిట్ట చివరి ఎన్నికలకు రెడీ
కామారెడ్డి జిల్లాలో చిట్టచివరి ఎన్నికలకు పోటీ దారులు సమరోత్సవంతో ముందుకు కదులుతున్నారు. పోటీలో నిలిచి ఎందుకు నువ్వా నేనా విధంగా కాలుదువుతున్నారు. చివరి విడుదల భాగంగా బాన్సువాడ మండలం 25 గ్రామపంచాయతీలు, 222 వాడు స్థానాలు ఉన్నాయి. అలాగే బీర్కూరు మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా 114 వార్డు స్థానాలు ఉన్నాయి.
అదేవిధంగా నసుల్లాబాద్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా 164 స్థానాలు వార్డు మెంబర్లు ఉన్నారు. అలాగే మదునూరు మండలంలో 21 గ్రామపంచాయతీలు ఉండగా 194 వార్డు సభ్యులు ఉన్నారు. జుక్కల్ మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉండగా, 270 వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే డోంగ్లి మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా, 116 వార్డ్ సభ్యులు ఉన్నాయి. అదేవిధంగా బిచ్కుంద 23 గ్రామపంచాయతీలు ఉండగా, 204 వార్డు సభ్య స్థానాలు ఉన్నాయి.
పైకం పంచాయితీలు...
పైకం కొట్టు పంచాయతీ కూర్చిపట్టు అన్న చందంగా తయారైంది వ్యవస్థ. పోటీ లేకుండా గుట్టుగా సర్పంచ్ స్థానాన్ని అధిరోహించేందుకు కొందరు పోటీ లేకుండా పైకం ఆశ చూపి కుర్చీ నీ కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం లక్షల్లో బేరసా రాలు చోటు చేసుకుంటున్నాయి.
కొన్ని గ్రామపంచాయతీలు అయితే జీవిత బీమా చేపిస్తామని, మరికొన్ని గ్రామపంచాయతీలను కైవసం చేసుకునే వ్యక్తులు తమ ఆడబిడ్డలకు కట్నం అందిస్తామని, ఇంకొన్ని గ్రామపంచాయితీలా చేజిక్కించుకునే సర్పంచి వ్యక్తులు గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తమ సొంత ఖర్చులతో భరిస్తామంటూ హామీలిస్తున్నారు. పోటీ లేకుండా ఎనాన్మస్ ప్రకారంగా తమను ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.