calender_icon.png 12 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ సర్కార్ గిల్లిదండ ఆట

11-12-2025 01:11:17 AM

  1. మజ్లిస్‌కు మేలు చేసేందుకే జీహెచ్‌ఎంసీ విస్తరణ 
  2. గ్లోబల్ సమ్మిట్‌లో డొల్ల కంపెనీలు 
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు   

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాం తి) : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలతో గిల్లిదండ ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. తాము జీహెచ్‌ఎంసీ విస్తరణకు వ్యతిరేకమని, కొత్త ప్రాంత ప్రజలు గ్రేటర్‌లో విలీనాన్ని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవా రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు గౌతమ్‌రావు, బండా కార్తీకరెడ్డి, ఎన్వీ సుభాష్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్, ప్రజలను అభిప్రాయాలు తీసుకోకుండానే డివిజన్లు పెంచు తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని హెచ్చరించారు.

69 లక్షల జనాభా ఉన్న గ్రేటర్‌ను అకస్మాత్తుగా ఒక కోటి 69 లక్షల జనాభాగా తీసుకురావడమేంటని, ఏ ప్రతిపాదికన 300 డివిజన్లు పెట్టారని రాంచందర్‌రావు ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి లాభం కలిగించేందుకు గ్రామాలను విలీనం చేశారనే అనుమానం తమకుందన్నారు.జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని మూడు భాగాలుగా చేసి.. వాటిలో ఒక భాగా న్ని మజ్లిస్‌కు ధారాదత్తం చేసే కుట్ర పన్నుతున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు.

గతం లో బీఆర్‌ఎస్ కూడా మజ్లిస్‌కు లబ్ధి చేకూర్చే నిర్ణయాలే తీసుకుందని విమర్శించారు. కొత్తగా విలీనమయ్యే గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై రెట్టింపు పన్నులు చెల్లించాల్సి వస్తోందన్నారు. గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్‌కావడం లేదని, రోడ్లు, డ్రైనేజీల విధానం సరిగా లేదని గతంలోనే అభ్యం తరాలు తెలిపామన్నారు. తమ ప్రతి పాదలను ప్రభుత్వం పక్కన పెట్టిందని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌లో ఒక పది డొల్ల కంపెనీలు వచ్చాయని, వాళ్లకు దేశమంతా అప్పలు ఉన్నాయని ఆయన విమర్శించారు. క్యాపిటల్ లేని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ప్రపంచంలో పెద్ద సిటీ కాదు.. దొంగ కంపెనీల సిటీగా అయ్యే ఛాన్స్ ఉందన్నారు.   

బీసీ కుల గణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. 1931లో బ్రిటిష్ ప్రభత్వం కుల గణన చేసిందని, ఆ తర్వాత 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కుల గణన ఎందుకు చేయలేదని రాంచందర్‌రావు నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ చిత్తశుద్దితోనే  2026 నుంచి దేశంలో కుల గణన జరుగుతుందన్నారు.