రామిశెట్టి రోశయ్యకు పాదాభివందనం చేసి సన్మానించిన మంత్రి తుమ్మల
మధిర, జూలై 1 (విజయక్రాంతి): శతవసంతం పూర్తి చేసుకుని 100వ వసంతంలోకి అడుగుపెట్టిన రామిశెట్టి రోశయ్య సన్మాన కార్యక్రమంలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పాదాభివందనం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఉపాధ్యాయుడిగా అక్షరాల సాక్షిగా జ్ఞానాన్ని పంచారు. క్రమశిక్షణ అనే పునాదిపై ఎందరినో తీర్చిదిద్దారు.
కమ్యూనిస్టు జెండా నీడన ఎర్రని సూర్యుడై నిలిచారు. ప్రజాప్రతినిధిగా పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడు, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ధన్యజీవుడు అని అన్నారు. ఆశయానికి ఆయువు పోసి, వందేళ్ల నిండు జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసిన ధన్యజీవి శ్రీ రామిశెట్టి రోశయ్య కి శతమానం భవతి. వంద వసంతాల జన్మదిన శుభాకాంక్షలు. మధిర మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత రామనాథం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, మొండితోక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






