23-04-2025 06:48:19 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైదరాబాద్ స్థానికల సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ బుధవారం సాయంత్రి 4 గంటల వరకు కొనసాగింది. పోలీంగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 112 ఓట్లలో 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 88 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, అటు 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 22 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకొగా, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గౌతం రావు, ఎంఐఎం నుంచి రాయాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. విరికి మద్దతుగా బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు రాజాసింగ్, దానం నాగేందర్, శ్రీ గణేశ్, కోదండరాం సహ పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.