ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
27-06-2024 04:34 PM
హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. పార్టీ మారిన వారిని అనర్హులను చేయాలంటూ బీఆర్ఎస్ తరపున ఎంఎల్ఎలు వివేకానంద, కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఎల పిటిషన్లపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మసనం గురువారం విచారణ చేపట్టింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ల వాదనలు వినిపించారు.






