ఆటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం
టేకులపల్లి, డిసెంబర్ 3, (విజయక్రాంతి):ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల ది నోత్సవం సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రత్యేక అవసరాల పి ల్లల పాఠశాలలో ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరా ల పిల్లలకు బహుమతులు అందజేసి, విభి న్న ప్రతిభావంతులైన విద్యార్థులకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులను, ఆయాలను బు ధవారం ఘనంగా సన్మానించారు.
టేకులపల్లి మండల విద్యాశాఖ అధికారి అజ్మీర జగన్ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులను ప్రతి ఒక్కరు ఆదరించి, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని, వారికి తోడ్పాటు ఇచ్చి వారికి సమాజంలో, స మాన గౌరవంతో ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని సూచించారు.వి ద్యాశాఖ పరంగా విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తల్లిదండ్రులు ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా ,ప్రత్యేక అవసరాల పిల్లల ను పట్టుదలతో మానసిక స్థైర్యంతో పెంచి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కంగల వెంకయ్య అధ్యక్షతన, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సౌజన్యంతో వివిధ ఆటల పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులకు, ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులను, ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవ చేసే ఆయాలను ఘనంగా సన్మానించారు. ఎస్ జి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాసీం, జిల్లా అధ్యక్షుడు పి. రామకృష్ణారావు, కోశాధికారి సమ్మయ్య, జాయింట్ సెక్రటరీ కే. కళ్యాణి, ఉమెన్స్ గిల్ ఫౌండర్ లోగాని జ్యోతిరాణి, ప్రతినిధులు చుంచు అంజమ్మ, సీహెచ్. శ్రీనివాసరావు, టీచర్లు రవీందర్ బాబు, నీరజాషారోన్, టేకులపల్లి ప్రభుత్వ హైస్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం. శ్రీనివాసరావు,
కోయగూడెం ఆశ్రమ హైస్కూల్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం. నాగేశ్వరరావు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. కిషోర్ సింగ్,పి ఆర్ టి యు టేకులపల్లి మండల అధ్యక్షుడు మోతిలాల్, బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ఉమా, ఫిజియోథెరపిస్ట్ శ్రీదేవి, టీచర్లు నరేష్, వాలమ్మ, కమల, రంజితాదేవి, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మా , కేర్ టేకర్ లు జే. పద్మ, కమల, ఎండీఎం వర్కర్స్ సునీత, బీబ్లీ, కాంతి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.




